Sudheer Babu: ‘మీ సినిమా ఎందుకు చూడాలి?’.. నెటిజన్‌కు సుధీర్‌ రిప్లై ఏంటంటే

తన కొత్త చిత్రం ‘హంట్‌’ విడుదల సమయం దగ్గరపడుతోన్న సందర్భంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు సుధీర్‌బాబు. ఆ వివరాలివీ..

Published : 26 Jan 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో దర్శకుడు మహేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హంట్‌’ (Hunt). శ్రీకాంత్‌ (Srikanth), భరత్‌ (Bharath) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు సుధీర్‌. మరి, ఫ్యాన్స్‌ ఏం అడిగారో, ఆయన ఎలా స్పందించారో చదివేయండి..

❓ ఈ సినిమాను ఎందుకు చూడాలో ఒక్క మాటలో చెప్పండి?

సుధీర్‌: ఇప్పటి వరకూ నేనే కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయని సబ్జెక్ట్‌ ఇది. సినిమాను చూసేందుకు అదే బలమైన కారణం.

❓ ఈ చిత్రంలో కథానాయిక ఎవరు?

సుధీర్‌: నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇందులో లవ్‌ లేదు. ప్రస్తుతానికి థ్రిల్‌ మాత్రమే.

❓ హీరోయిన్‌ పాత్ర లేకుండా, కమర్షియాలిటీకి భిన్నంగా తీసిన సినిమా కదా. మీ ధైర్యమేంటి?

సుధీర్‌: మంచి స్క్రిప్ట్ సినిమాకి అతి పెద్ద కమర్షియల్ అంశం అని నేను నమ్ముతా.

❓ ‘హంట్‌’ సీక్వెల్‌ ఆశించొచ్చా?

సుధీర్‌: ఎందుకు ఆశించకూడదు!

❓ మీతో కలిసి ‘హంట్‌’ సినిమా చూడాలని ఉంది. కుదురుతుందా?

సుధీర్‌: రేపు (గురువారం) ఉదయం ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వచ్చేయండి బ్రదర్‌.

❓ మీరు పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో నటించే అవకాశం ఉందా?

సుధీర్‌: ఆ పనిలోనే ఉన్నా. ‘మామా మశ్చీంద్రా’ సినిమా కోసం వేచి చూడండి.

❓ ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ చిత్రం ఎప్పుడు చేస్తారు?

సుధీర్‌: నా తదుపరి ప్రాజెక్టుల్లో కమర్షియల్‌ కథలు చాలానే ఉన్నాయి.

❓ ‘హరోంహర’ సినిమా అప్‌డేట్‌ ఇస్తారా?

సుధీర్‌: దానికి ఇంకా సమయం ఉంది సోదరా. ప్రస్తుతానికి ‘హంట్‌’ గురించి మాట్లాడుకుందాం.

❓ దర్శకత్వం చేసే అవకాశం వస్తే పవన్ కల్యాణ్‌తో ఎలాంటి చిత్రం తీస్తారు?

సుధీర్‌: పవన్‌ కల్యాణ్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌పై మంచి పట్టుంది. గతంలో ఆయన చేసిన ‘జానీ’ తరహా చిత్రం చేస్తా.

❓ మీకు స్ఫూర్తి ఎవరు?

సుధీర్‌: మంచి నటులందరూ. మంచి సినిమాలన్నీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని