sudheer babu: ‘హరోం హర’ పూర్తి

‘భయపడితే సింహాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు’ అంటూ ఇటీవలే తన రాబోయే సినిమా ‘హరోంహర’ ప్రపంచాన్ని పరిచయం చేశారు కథానాయకుడు సుధీర్‌ బాబు.

Updated : 21 Apr 2024 13:35 IST

‘భయపడితే సింహాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు’ అంటూ ఇటీవలే తన రాబోయే సినిమా ‘హరోంహర’ ప్రపంచాన్ని పరిచయం చేశారు కథానాయకుడు సుధీర్‌ బాబు. ఆయన, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రమిది. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది చిత్రబృందం. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్‌ చిత్రమిది. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని