sudheer babu: భయపడితే కాదు.. భయపెడితేనే..!

‘‘వాడు సమరమే మొదలుబెడితే.. ఆ సంభవానికి సంతకం నాదైతది’’ అంటున్నారు సుధీర్‌బాబు. మరి ఆ సమరం దేనికోసం.. అందులో పైచేయి సాధించేదెవరు? తెలుసుకోవాలంటే ‘హరోం హర’ చూడాల్సిందే.

Updated : 28 Nov 2023 09:34 IST

‘‘వాడు సమరమే మొదలుబెడితే.. ఆ సంభవానికి సంతకం నాదైతది’’ అంటున్నారు సుధీర్‌బాబు. మరి ఆ సమరం దేనికోసం.. అందులో పైచేయి సాధించేదెవరు? తెలుసుకోవాలంటే ‘హరోం హర’ చూడాల్సిందే. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కిస్తున్నారు. సుమంత్‌ జి నాయుడు నిర్మాత. మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్‌ ఆఫ్‌ సుబ్రమణ్యం పేరుతో ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘అందరూ పవర్‌ కోసం గన్‌ పట్టుకుంటారు. కానీ, ఇది ఏడేడో తిరిగి నన్ను పట్టుకుంది. ఇది నాకేమో సెప్తా ఉంది’’ అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం యాక్షన్‌ కోణంలో ఆసక్తికరంగా సాగింది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో సుబ్రమణ్యం అనే పాత్రలో సుధీర్‌ కనిపించనున్నారు. టీజర్‌లో కథ బయట పెట్టకుండా జాగ్రత్తగా సినిమాలోని కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. సుధీర్‌ పూర్తిగా మాస్‌ యాక్షన్‌ పాత్రలో కనిపించారు.    ‘‘ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు. తెగిస్తేనే తెగ్గి నడుసుకుంటారు’’, ‘‘భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు’’ అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్‌లు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని