Sudheer Babu: ఆ విషయంలో నేను ఫెయిల్‌ అయ్యానేమో: సుధీర్‌ బాబు

‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్‌ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

Published : 19 May 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృష్ణ అల్లుడు, మహేశ్‌బాబు (Mahesh Babu) బావగా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu). విభిన్న కథలను ప్రేక్షకులకు చెప్పేందుకు ముందుండే ఈ హీరో త్వరలో ‘హరోం హర’ (Harom Hara)తో సందడి చేయనున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు. తన కెరీర్‌నీ సమీక్షించుకున్నారు. ‘మీరు నటించిన వాటిలో అంచనాలు తలకిందుకైన సినిమా ఏది?’ అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘ప్రేమకథా చిత్రమ్‌’ మినహా అన్ని సినిమాల ఫలితాల విషయంలో నేను నిరుత్సాహపడ్డా. కమర్షియల్‌గా ఇంకా బెటర్‌గా ఉండాల్సిన చిత్రాలవి. వాటిని ప్రేక్షకులకు చేరువ చేయడంలో నేను ఫెయిల్‌ అయ్యానేమో అనిపించింది. ముఖ్యంగా.. భలే మంచి రోజు, సమ్మోహనం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా ఇవన్నీ టెక్నికల్‌గా బాగున్నా ఆశించిన ఫలితం ఇవ్వలేదు’’ అని అన్నారు.

‘మహేశ్‌బాబుతో మల్టీస్టారర్‌ ఎప్పుడు?’ అని అడగ్గా.. అందుకు తానుకూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మల్టీస్టారర్‌ గురించి తమ మధ్య ఇప్పటివరకు చర్చ జరగలేదని, ఏదోఒక రోజు అది సాధ్యం కావొచ్చన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘హరోం హర’ను తెరకెక్కించారు జ్ఞానసాగర్‌ ద్వారక. మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు