Sundeep Kishan: సందీప్‌ యాక్షన్‌ ‘వైబ్‌’

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జేె. ఇప్పుడాయన సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు.

Updated : 31 Mar 2024 13:45 IST

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జేె. ఇప్పుడాయన సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘వైబ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో సందీప్‌ ఓ చేతిలో రక్తంతో తడిచిన కత్తితో మరో చేతిలో నిప్పంటించిన సీసాతో ఎవరిపైనో దాడికి సిద్ధమవుతున్నట్లుగా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో తన మిత్రులు కూడా హాకీ స్టిక్స్‌ పట్టుకొని పోరుకు సై అన్నట్లుగా కనిపించారు. ఇక టైటిల్‌ను సినిమా నేపథ్యాన్ని సూచించేలా హ్యాండ్‌ పంచ్‌ రూపంలో డిజైన్‌ చేశారు. ‘‘ఒక విద్యార్థి.. అతని స్నేహితులు సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడం వరకు జరిగిన కథే దీని ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని