Sunny Leone: కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌కు సన్నీ లియోనీ!.. వైరల్‌గా హాల్‌టికెట్‌

సన్నీ లియోనీ వివరాలతో కూడిన హాల్‌టికెట్‌ నెట్టింట వైరల్‌ అయింది.

Published : 19 Feb 2024 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కానిస్టేబుల్‌ పరీక్షకు సన్నీ లియోనీ (Sunny Leone) హాజరైందా? అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె వివరాలతో కూడిన హాల్‌ టికెట్‌ ఫొటో చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణమైంది. విషయం ఏంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పోలీస్​ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఇటీవల విడుదల చేసింది. వాటిలోని ఓ హాల్‌టికెట్‌లో సన్నీ లియోనీ పేరు, ఆమె ఫొటో కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తమైంది. దీంతో, రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టగా, కొందరు సీరియస్‌ అయ్యారు. పరీక్ష జరిగిన శనివారం ఈ హాల్‌టికెట్‌ వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్‌ అయింది. యూపీపీఆర్‌బీ 75లో జిల్లాల్లో 2385 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది.

ఎవరో ఆకతాయి ఈ పని చేసి ఉంటారని భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కర్ణాకటలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడూ సన్నీ లియోనీ వివరాలే బయటకు రావడం గమనార్హం. ‘రంగీలా’ (మలయాళం), ‘కోకా కోలా’, ‘హెలెన్‌’ తదితర చిత్రాలతో ఈ నటి బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని