Ram Charan: రామ్‌చరణ్‌ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం

నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేశారు.

Updated : 27 Mar 2024 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా సురేఖ భక్తులకు అన్నదానం చేశారు. ‘‘‘అత్తమ్మ కిచెన్‌’ సారథ్యంలో 500 మందికి సురేఖ అన్నదానం చేశారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’’ అని ఇన్‌స్టాలో వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. ఉపాసన, కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు, రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు విషెస్‌ చెప్పారు.

‘‘ఆస్కార్‌ పురస్కారం పొందిన చిత్రంలో నటించి, గ్లోబల్‌ స్టార్‌ స్థాయికి చేరుకున్న రామ్‌చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్‌ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్‌ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’’ - పవన్‌ కల్యాణ్‌

‘‘మా గేమ్‌ ఛేంజర్‌ రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. తుపాను మాదిరిగా యాక్షన్‌కు ముందు నువ్వు నిశ్శబ్దం, నిదానంగా ఉంటావు. ఆ తర్వాత మెరుపులు మెరిపిస్తావు. అభిమానుల పట్ల నువ్వు చూపించే ప్రేమ, వినయం ఎప్పటికీ మారదు. (జరగండి పాటను ఉద్దేశించి) నీకు నీ అభిమానులకు నేను ఇచ్చే పుట్టినరోజు కానుక ఇదే’’ - శంకర్‌

‘‘హ్యాపీ బర్త్‌డే చరణ్‌. ప్రేమ, వ్యక్తిత్వాన్ని మీరు మరింత వ్యాప్తి చేయాలని.. మరెంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. మరో అద్భుతమైన సంవత్సరాన్ని మాకు అందించాలని ఆశీస్తున్నా. లవ్‌ యూ చరణ్‌’’ - సాయి ధరమ్‌ తేజ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని