Kanguva: ఆ సినిమాలో నటించడం అదృష్టం: సూర్య

‘కంగువ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సూర్య. 

Published : 25 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువ’ (Kanguva). పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సూర్య భిన్నమైన రూపాల్లో కనిపించనున్నారు. దిశా పటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యోగిబాబు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‘‘కంగువ ప్రత్యేకమైన చిత్రం. ఇందులో భాగం కావడం నా అదృష్టం. ఇలాంటి గొప్ప కథను తెరకెక్కించాలనుకున్న దర్శకుడు శివ, నిర్మాతలు జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లకు కృతజ్ఞతలు. డీఓపీ వెట్రి పళనిస్వామి, అద్భుతమైన సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‌లకు ధన్యవాదాలు. ఏ సినిమాకైనా స్క్రిప్ట్‌కి, మేకింగ్‌కి మధ్యలో రాజీ పడే సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి వాటిని అధిగమించి దీనిని తెరకెక్కించాం. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని సూర్య అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని