Suriya: సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్‌ ఏమన్నారంటే..

నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే.

Published : 12 Apr 2024 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూర్య (Suriya) హీరోగా వెట్రిమారన్‌.. ‘వాడి వాసల్‌’ (Vaadivaasal) చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఆయా కథనాలను కొట్టిపారేస్తూ వెట్రిమారన్‌ తాజాగా ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘విడుతలై పార్ట్‌2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నానని చెప్పారు. అది పూర్తైన తర్వాత తప్పకుండా ‘వాడి వాసల్‌’ రెగ్యులర్‌ షూట్‌ తిరిగి మొదలుపెడతానని స్పష్టతనిచ్చారు. అనంతరం ఆయన ధనుష్‌తో చేయనున్న ‘వడచెన్నై 2’ గురించి మాట్లాడుతూ.. దానికి చాలా సమయం పడుతుందన్నారు.    ‘వాడి వాసల్‌’ తర్వాత తాను ఏ ప్రాజెక్ట్‌ చేసేది తెలియదన్నారు.

జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడి వాసల్‌’ తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్‌ తొలిసారి ఈ ప్రాజెక్ట్‌ కోసం కలిసి పని చేస్తున్నారు. 2021లోనే ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 2022లో షూట్‌ మొదలుకాగా.. సూర్యపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో చూపించే ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో సీజీ పనులు జరుగుతున్నాయని గతంలో వెట్రిమారన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని