Taapsee Pannu: ఆ రూమరే.. నిజమైంది

‘కొన్నిసార్లు పుకార్లు నిజమవుతాయి. ‘డంకీ’లోని మను పాత్ర సైతం అలాంటిదే’ అంటోంది తాప్సీ పన్ను.

Updated : 24 Dec 2023 10:31 IST

‘కొన్నిసార్లు పుకార్లు నిజమవుతాయి. ‘డంకీ’లోని మను పాత్ర సైతం అలాంటిదే’ అంటోంది తాప్సీ పన్ను. ఇదేవిషయమై ఓ మీడియా సంస్థతో చెబుతూ ‘‘డంకీ’ ప్రాజెక్టు ప్రకటించిన కొత్తలో షారుక్‌ పక్కన నటించే లక్కీఛాన్స్‌ ఎవరికి వస్తుందో అని చాలామంది కథానాయికలు ఎదురు చూశారు. ఎలా మొదలైందో తెలియదుగానీ.. ఆ చిత్రంలో నేను నటిస్తున్నానంటూ ఓ రూమర్‌ బయల్దేరింది. దాన్ని నేను తేలిగ్గా కొట్టిపడేశా. కొన్నాళ్లకి నేను సౌత్‌కొరియన్‌ సినిమాలో నటిస్తూ, విదేశంలో ఉన్న  షూటింగ్‌లో ఉన్న సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ సర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘డంకీ’లో నువ్వే హీరోయిన్‌ అంటున్నారంతా. ఆ వార్తని నిజం చేద్దామా? ఇండియా రాగానే చెప్పు. వచ్చి కథ చెబుతాను’ అన్నారు. నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యా. అక్కడినుంచి తిరిగి రాగానే వెంటనే వెళ్లి సర్‌ని కలిశా’ అంటూ ‘డంకీ’ సినిమాలో తన ఎంపిక గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది తాప్సీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని