Taapsee: ఆయనతో నటిస్తానని అనుకోలేదు

మనుగా ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల మనసుకు దగ్గరై, ఈ ఏడాదికి విజయవంతంగా ముగింపు పలికింది బాలీవుడ్‌ కథానాయిక తాప్సి. ఆ సినిమా అందుకుంటున్న విజయం సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

Updated : 31 Dec 2023 12:23 IST

నుగా ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల మనసుకు దగ్గరై, ఈ ఏడాదికి విజయవంతంగా ముగింపు పలికింది బాలీవుడ్‌ కథానాయిక తాప్సి. ఆ సినిమా అందుకుంటున్న విజయం సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. రాబోయే చిత్రం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ విషయాల్ని, షారుక్‌తో కలిసి నటించిన అనుభావాల్ని అభిమానులతో పంచుకుంది. ‘నేను షారుక్‌తో కలిసి నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా కోసం ఆయనతో రెండేళ్లు పనిచేశాను. ఈ సినిమా ఎన్నో నేర్పింది. చిత్రీకరణ సమయంలో తన జీవితంలో జరిగిన అన్నీ సంఘటనల్ని నాతో పంచుకున్నారు షారుక్‌. మంచి నటులుగా ఎదగడానికి ఎన్నో విషయాలు చెప్పారు’ అని తెలిపింది. ‘‘హసీన్‌ దిల్‌రుబా’కు రానున్న సీక్వెల్‌ ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. మర్డర్‌ మిస్టరీగా రానున్న ఈ సినిమా మరింత థ్రిల్‌ని పంచుతుంది. తొలిభాగం కన్న ఎక్కువ మలుపులతో, సస్పెస్స్‌ కథనంతో ఆసక్తిగా ఉంటుంది. దర్శకుడు జయ్‌ప్రద్‌ దేశాయ్‌, నిర్మాత కనికా థిల్లాన్‌ ఈ చిత్రం పట్ల నమ్మకంగా ఉన్నారు. నేనూ, విక్రాంత్‌ చేసిన పాత్రలు తప్పక అలరిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ ప్రాజెక్టుకు ఫ్రాంచైజీలు కొనసాగించాలని అనుకుంటున్నాము’ అని చిత్ర విషయాలు పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని