Taapsee: అందుకే పెళ్లి విషయం బయటకు చెప్పలేదు: తాప్సీ

తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి గల కారణాన్ని తాప్సీ వివరించారు.

Updated : 10 Apr 2024 12:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి తాప్సీ (Taapsee) ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమన్నారు.

‘‘నా వివాహానికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి పెంచాలని అనుకోవడం లేదు. దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో నా భర్తకు మరో అభిప్రాయం ఉండొచ్చు. అందుకే మేము దీని గురించి మీడియా, సోషల్‌ మీడియాలో చెప్పలేదు. పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి దీనిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. వాళ్ల అంగీకారంతోనే చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆర్భాటాలకు చోటివ్వకుండా కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. భవిష్యత్తులో అందరికీ షేర్‌ చేయాలనుకుంటే అప్పుడు పోస్ట్‌ చేస్తాను’ అని చెప్పారు. మార్చి 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ-మథియాస్‌ బో వివాహం జరిగింది. ఇటీవల వీరి పెళ్లి వీడియో లీకవ్వగా అది వైరల్‌గా మారింది.

సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘డంకీ’తో హిట్‌ను సొంతం చేసుకున్నారు తాప్సీ. ప్రస్తుతం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ‘హసీన్‌ దిల్‌రుబా’కు సీక్వెల్‌గా ఇది రానుంది. జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకుడు. విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీనితో పాటు ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇటీవల విడుదలైన ‘ధక్ ధక్’ చిత్రానికి తాప్సీ నిర్మాతగానూ వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని