Tamannaah: స్త్రీ 2 లో తమన్నా ప్రత్యేక గీతం!

‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ ఇటీవలే రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో తన స్టెప్పులతో కుర్రకారుల్ని ఉర్రూతలూగించింది కథానాయిక తమన్నా.

Updated : 08 Dec 2023 09:38 IST

‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ ఇటీవలే రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో తన స్టెప్పులతో కుర్రకారుల్ని ఉర్రూతలూగించింది కథానాయిక తమన్నా. సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు ప్రత్యేక గీతాలతో సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోందీ భామ. ఇప్పుడు మరోసారి తన డ్యాన్సుతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోందామె. బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్త్రీ 2’. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో తమన్నా కనిపించనున్నట్లు సమాచారం. ‘‘స్త్రీ 2’లో తమన్నా ప్రత్యేక పాటలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన పాటలలో తన డ్యాన్సుతో ఆకట్టుకున్న ఆమె.. ఈ పాటకు సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నార’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని