Pushpa 2: ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్‌’ నటుడు ప్రశంసలు..

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్‌ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు.

Updated : 23 Apr 2024 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌పై (Allu Arjun) కన్నడ నటుడు ప్రశంసలు కురిపించారు. ‘కేజీఎఫ్‌’తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తారక్‌ పొన్నప్ప తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘పుష్ప2’లో (Pushpa 2) కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకొన్నారు. ‘‘పుష్ప ది రూల్‌’లో నాకు అల్లు అర్జున్‌తో యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. గతంలో స్టంట్స్‌ చేసిన అనుభవం లేదు. ఫైట్‌ సీక్వెన్స్‌ చేసేటప్పుడు ఆయన ఎన్నో కొత్త విషయాలను చెప్పారు. స్క్రీన్‌పై కనిపించే విధానంలో సలహాలు ఇచ్చారు. బాడీ పొజిషన్స్‌ గురించి వివరించారు. ఆయనకు డ్యాన్స్‌, స్టంట్స్‌పై ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన గొప్ప నటుడు’’ అని ప్రశంసించారు.

‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). రష్మిక కథానాయిక. పార్ట్‌-1లో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ఎస్పీ భన్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌గా ఆకట్టుకున్నారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగానే ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. శ్రీవల్లి.. పుష్పకు భార్యగా కనిపించనుంది. ఇటీవలే ఈ పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. ఎన్నో బాధ్యతలు ఉంటాయన్నారు. ఈ సీక్వెల్‌ అభిమానుల అంచనాలను మించుతుందన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెల్‌ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని