Suma: అది చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: సుమ పోస్ట్‌

‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌) (Aadujeevitham) చిత్రాన్ని ఉద్దేశించి ప్రముఖ యాంకర్‌ సుమ (Suma) పోస్ట్‌ పెట్టారు.

Published : 30 Mar 2024 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌). ప్రముఖ వ్యాఖ్యాత సుమ తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా తనకెంతో నచ్చిందన్నారు. దర్శకుడి ప్రతిభను మెచ్చుకున్నారు. ‘‘ఆడు జీవితం’ చూశా. నజీబ్‌ కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా తెలియజేశారు. దర్శకుడు బ్లెస్సీకి నా సెల్యూట్‌. పృథ్వీరాజ్‌.. పూర్తిగా బరువు తగ్గిపోయి, పక్కటెముకలు బయటకు కనిపించే సన్నివేశంలో మిమ్మల్ని చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, అంకితభావానికి ఇది నిదర్శనం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. దీనితోపాటు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ల ‘టిల్లు స్క్వేర్‌’ కూడా వీక్షించినట్లు చెప్పారు. సినిమా ఆద్యంతం నవ్వులు పూయించిందన్నారు. టీమ్‌ను మెచ్చుకున్నారు.

జీవనోపాధిలో భాగంగా కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియేల్‌ ‘గోట్‌ డేస్‌’ అనే నవల రచించారు. దానిని ప్రామాణికంగా చేసుకుని బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. నజీబ్‌ పాత్ర పోషించారు. అమలాపాల్‌, కేఆర్ గోకుల్‌ కీలక పాత్రల్లో నటించారు. బ్లెస్సీ 16 ఏళ్ల కలే ‘ఆడు జీవితం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో రాణిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని