Teja sajja: మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్‌లో ‘మిరాయ్‌’..

తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్‌’. దీని గ్లింప్స్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Published : 19 Apr 2024 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హను మాన్‌’ (Hanuman)తో సూపర్‌సక్సెస్‌ అందుకున్న తేజ సజ్జా. ఇప్పుడు అదే జోష్‌తో తన తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కార్తిక్‌ ఘట్టమనేనితో కలిసి ‘మిరాయ్‌’ (Mirai) అంటూ మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా దీని గ్లింప్స్‌ను విడుదల చేయగా అది సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై ఆనందం వ్యక్తంచేస్తూ తేజ పోస్ట్ పెట్టారు.

‘హనుమాన్‌’తో ఈ యంగ్‌ హీరో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తను తర్వాత ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకుంటాడా అని సినీప్రియులంతా ఎదురుచూశారు. దానికి తగినట్లే సరికొత్త కాన్సెప్ట్‌తో ‘మిరాయ్‌’ను ప్రకటించి అందరిలో ఆసక్తి పెంచారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో నంబర్‌వన్‌లో కొనసాగుతోంది. ‘మీ ప్రేమ వెలకట్టలేనిది. ఈ గ్లింప్స్‌ను ఆదరించినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పారు తేజ సజ్జా. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న ఈ చిత్రం విడుదల చేయనున్నారు. మనిషిని ధైవంగా మార్చే శక్తి ఉన్న గ్రంథాలను కాపాడేందుకు వచ్చిన సూపర్‌హీరో పాత్రలో తేజ నటించనున్నారు. ఇందులోనూ గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు. రితికానాయక్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారు. హనుమాన్‌కు సంగీతం అందించిన గౌర హరి దీనికి కూడా స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని