Film Exhibitors: నిర్మాతలు అలా చేయకపోతే థియేటర్ల మూసివేత తప్పదు: ఎగ్జిబిటర్లు

ఇక నుంచి అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించబోమని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

Updated : 22 May 2024 16:19 IST

హైదరాబాద్‌: సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు (telangana film exhibitors) హెచ్చరించారు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని గుర్తు చేశారు. పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వెల్లడించారు.

  • ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు పర్సంటేజీ ఇవ్వాలి.
  • అద్దె ప్రతిపాదికన ఇకనుంచి సినిమాలు ప్రదర్శించం. మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ చెల్లిస్తేనే ప్రదర్శిస్తాం.
  • జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. కల్కి 2898 ఏడీ, పుష్ప 2, గేమ్ ఛేంజర్‌, భారతీయుడు 2 చిత్రాలకు మినహాయింపు ఉంది. ఇతర సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తాం.
  • కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇకనుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని