Ramoji Rao: సినీ పరిశ్రమకు తీరని లోటు.. రామోజీకి నివాళులర్పించిన నిర్మాతల మండలి

రామోజీరావుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నివాళులర్పించింది.

Published : 08 Jun 2024 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (88)కు సంతాపం తెలుపుతూ రేపు చిత్రపరిశ్రమ బంద్‌ను ప్రకటించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంది. ఆయన (Ramoji Rao) మృతికి నివాళులర్పిస్తూ.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను విడుదల చేసింది.

కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్‌’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది

‘రామోజీరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు వార్తా రంగంలో, వినోదరంగంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన స్థాపించిన టీవీ ఛానల్‌ ఎన్నో భాషల్లో విస్తరించింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సేవలు అందించారు. ఎంతోమంది కొత్త వారిని సినీరంగానికి పరిచయం చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ గిన్నిస్‌ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణం. ఆయన చేసిన సేవలు ప్రతీ భారతీయుడి మదిలో ఎప్పటికీ గుర్తుంటాయి’ అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని