
Aaradugula Bullet: నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నయన్ సినిమా
హైదరాబాద్: హీరో గోపీచంద్, హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితమే పూర్తైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం స్పందించింది. దసరా కానుకగా వచ్చే నెలలో ఈసినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వక్కంతం వంశీ కథ అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.