Mega 154: మాస్ పూనకాలు మొదలాయే.. మాస్ లుక్‌లో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ షురూ అయ్యింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు...
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ షురూ అయ్యింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. చిరు లుక్ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. ‘మాస్ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
‘‘మెగాస్టార్.. ఆయన పేరు వింటే.. అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే.. అర్థం కాని ఆరాటం ! తెర మీద ఆయన కనబడితే... ఒళ్లు తెలియని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం.. ఆయన్ని మొదటి సారి కలిసిన రోజు కన్నకల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’’ అంటూ ప్రాజెక్ట్ ఆరంభంపై బాబీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agniveer recruitment: ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్మెంట్లో కీలక మార్పు
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు