శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలందించారు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది...

Updated : 06 Dec 2022 16:07 IST

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలందించారు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ సినిమాలోని రెండో పాటని విడుదల చేశారు. ‘‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ ప్రేమ గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా సాహిత్యం అందించారు. యామిని ఘంటసాల, పీవీఎస్‌ఎన్‌ రోహిత్‌ ఆలపించారు. పాటలో వైష్ణవ్‌, రకుల్‌ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ‘‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అటవీ నేపథ్యంలో సాగే కథతో.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని