Social Look: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్యాంగ్‌ ఉత్సాహం .. శ్రీముఖి, అనసూయ అల్లరి

గుర్రపు సవారీ చేస్తూ ఫొటో దిగాలనేది ప్రియాంక జవాల్కర్‌ కోరిక. ‘అది ఈ రోజు నెరవేరింది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Published : 21 Aug 2021 01:29 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుర్రపు స్వారీ చేస్తూ ఫొటో దిగాలనేది ప్రియాంక జవాల్కర్‌ కోరిక. ‘అది ఈ రోజు నెరవేరింది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

* ఎలక్ట్రిక్‌ బైక్‌ని నడిపి, సందడి చేశారు దర్శకురాలు నందిని రెడ్డి.

* కష్టతరమైన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపిస్తోంది ఊర్వశి రౌతేలా.

* ‘ఆగండి.. ఆలోచించండి’ అంటూ తన ఫొటోని పంచుకున్నాడు యువ నటుడు వరుణ్‌ తేజ్‌.

* తను ముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని పరిచయం చేసింది ఈషా రెబ్బా. దాని పేరు చిన్ను.

* శ్రీముఖి, అనసూయ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది? ఆ హంగామాని వీడియోలో బంధించి అభిమానులతో పంచుకుంది శ్రీముఖి.

* ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణని ముగించింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది. బృందమంతా ఉత్సాహంగా కనిపించింది.




















































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని