Kriti Sanon: షాహిద్‌- కృతి సనన్ ఇంటిమేట్‌ సీన్‌.. సెన్సార్‌ బోర్డు చెప్పిన మార్పులేంటంటే?

‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ఈ సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డు సూచించిన మార్పులేంటంటే?

Published : 07 Feb 2024 22:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor), కృతి సనన్‌ (Kriti Sanon) జంటగా నటించిన చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ (Teri Baaton Mein Aisa Uljha Jiya). అమిత్‌ జోషి (Amit Joshi), ఆరాధన సాహ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. సెన్సార్‌ బోర్డు (Censor board) చిత్ర బృందానికి తాజాగా కొన్ని మార్పులు సూచిందింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ఇంటిమేట్‌ సీన్‌ (శృంగార సన్నివేశం) ట్రిమ్‌ చేయమని, సినిమా సెకండాఫ్‌లో వచ్చే ‘దారు’ పదాన్ని ‘డ్రింక్‌’గా మార్చాలని ఆదేశించింది. స్మోకింగ్‌ సీన్స్‌ వచ్చేటప్పుడు ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే వార్నింగ్‌ ఫాంట్‌ సైజ్‌ పెంచాలని చెప్పింది. ఈ మేరకు చిత్ర బృందం మార్పులు చేసిందని సమాచారం. 36 సెకన్ల నిడివి ఉన్న ఇంటిమేట్‌ సీన్‌ను 27 సెకన్లకు కుదించినట్లు తెలిసింది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా రన్‌టైమ్‌ 2: 23 గంటలు.

సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో షాహిద్‌ రోబో సైంటిస్ట్‌గా నటించారు. కృతి సనన్‌ రోబోగా కనిపించనున్నారు. ఈ లేడీ రోబోని ఆ సైంటిస్ట్‌ ప్రేమిస్తే ఏం జరిగింది? అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించడంపై షాహిద్ ఓ ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేశారు. ‘‘కొన్నాళ్లుగా నేను పూర్తిస్థాయి ప్రేమకథల్లో నటించలేదు. ఒకే రకమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. అప్పుడే ఈ సినిమా అవకాశం వచ్చింది. చాలా విభిన్నమైన కథ ఇది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు