Thalaivar 171: రజనీ 171 టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌.. లోకేశ్‌ కనగరాజ్‌ కామెంట్స్‌ వైరల్‌

రజనీకాంత్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది.

Published : 29 Mar 2024 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth), దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తలైవా 171గా ఇది ప్రచారంలో ఉంది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ను ఉద్దేశించి చిత్రబృందం గురువారం సాయంత్రం షేర్‌ చేసిన పోస్టర్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. లోకేశ్‌ కనగరాజ్‌ గతంలో ఈసినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్‌ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కాస్త నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఆయన కనిపించే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కాకపోతే, ఇందులో నా గత చిత్రాల్లో చూపించిన విధంగా మాదక ద్రవ్యాలను చూపించను’’ అని అన్నారు.

‘జైలర్‌’ సక్సెస్‌ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచారు రజనీకాంత్‌. ఇటీవల ‘లాల్‌సలామ్‌’తో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌తో సినిమా చేస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఆయన లోకేశ్‌ కనగరాజ్‌తో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించనున్నారు. రజనీకి ఇది 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా పేరుని ఏప్రిల్‌ 22న ప్రకటించనున్నారు. తాజాగా విడుదలైన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ చూస్తే ఇది సమయంతో ముడిపడిన కథగా తెలుస్తోంది. ‘లియో’ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ చేస్తోన్న చిత్రమిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని