Thaman: నెగెటివిటీపై తమన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌.. చిత్రాల కోసం రంగంలోకి దిగారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (Thaman). ఆయా సినిమాల కోసం ఆయన శ్రమిస్తోన్న తరుణంలో పలువురు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 15:12 IST

హైదరాబాద్‌: తన వర్క్‌ గురించి నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవాళ్లకు ఘాటుగా సమాధానమిచ్చారు సంగీత దర్శకుడు తమన్ (Thaman)‌. తనని కామెంట్‌ చేస్తోన్న వాళ్లందర్నీ చిన్నపిల్లలంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే తమన్‌ ఉన్నట్టుండి ఇంతటి ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమిటంటే..!

‘అల.. వైకుంఠపురములో’, ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో ఇటీవల మంచి సక్సెస్‌ను అందుకున్నారు తమన్‌. ఆయా చిత్రాలు సూపర్‌హిట్‌ కావడంలో ఆయన అందించిన మ్యూజిక్‌ కూడా కీలకపాత్ర పోషించిందని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తమన్‌ ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల చిత్రాల కోసం పనిచేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన మ్యూజిక్‌ ఏమీ బాగోదని.. ఏమాత్రం వినాలనిపించదని పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టారు. దీనిపై తమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి!! చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని