Thangalaan: విక్రమ్‌ ‘తంగలాన్‌’ వాయిదా.. ఎప్పుడు రానుందంటే?

విక్రమ్‌- పా. రంజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘తంగలాన్‌’. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Published : 16 Jan 2024 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ (Vikram) హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan) విడుదల వాయిదా పడింది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు చెప్పింది. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు దర్శక, నిర్మాతలు. వాయిదా వేయడానికి కారణమేంటో వెల్లడించలేదు. ఏప్రిల్‌లో ఏ రోజున విడుదల చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు.

చిరంజీవి కొత్త సినిమా టైటిలిదే.. వీడియో షేర్‌ చేసిన మూవీ టీమ్‌

కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘నేను ఇప్పటి వరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ఇదొక విభిన్నమైన కథ. ఇందులో గ్లామర్‌కు చోటులేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది’ అని ప్రచారంలో భాగంగా విక్రమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు