Vikram: విక్రమ్ జోక్‌ చేశారు.. క్లారిటీ ఇచ్చిన ‘తంగలాన్‌’ టీమ్‌

విక్రమ్‌ (Vikram) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ సినిమా ‘తంగలాన్‌’. ఇందులో విక్రమ్‌ డైలాగుల విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Published : 03 Nov 2023 16:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విభిన్న కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘తంగలాన్‌’ (Thangalaan). విక్రమ్‌ హీరోగా పా రంజిత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌ విడుదల సందర్భంగా సినిమాలో తన పాత్ర గురించి విక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాజాగా వాటిపై మూవీ యూనిట్‌ స్పందించింది. డైలాగుల విషయం గురించి విక్రమ్ జోక్‌ చేశారని క్లారిటీ ఇచ్చింది.

టీజర్‌ విడుదల కార్యక్రమంలో విక్రమ్‌ (Vikram) మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ సినిమాలో డైలాగుల్లేవు. ‘శివపుత్రుడు’ తరహాలో ఉంటుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అని చెప్పారు. దీంతో సినిమాకు సంబంధించిన టాప్ సీక్రెట్‌ను విక్రమ్‌ లీక్‌ చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తాజాగా దీనిపై స్పందించిన టీమ్‌.. ‘‘టీజర్‌లో మాత్రమే తనకు డైలాగుల్లేవని విక్రమ్‌ చెప్పారు. ఆయన మాట్లాడింది సినిమా మొత్తం గురించి కాదు. ఇందులో ఆయనకు డైలాగులున్నాయి. అన్ని సన్నివేశాలను లైవ్‌సౌండ్‌తో తెరకెక్కించాం’’ అని వివరించింది.

రివ్యూ: ‘మా ఊరి పొలిమేర-2’.. భయపెట్టిందా.. లేదా?

బంగారు గనుల నేపథ్యంలో ‘తంగలాన్’ తెరకెక్కుతోంది. విక్రమ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాలో మాళవిక మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీల్లో సిద్ధమవుతోంది. 2024 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు