Thank God: ఓటీటీలో ‘థ్యాంక్ గాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర కీలక పాత్రల్లో నటిించిన ‘థ్యాంక్ గాడ్’ ఓటీటీలో విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్‌గణ్ ( Ajay Devgn), సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra) కలిసి నటించిన చిత్రం ‘థ్యాంక్ గాడ్’ (Thank God). రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కథానాయిక. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
యమలోకం...చిత్రగుప్తుడు అంటే మనం సినిమాల్లో ఇప్పటి వరకూ చూసింది వేరు. పంచెకట్టు...నెత్తిమీద తలపాగాతో చిత్రగుప్తుని వేషధారణ ఉంటుంది. కానీ ఈ మోడ్రన్ చిత్రగుప్తుడి తీరే వేరుగా ఉంది. సూటుబూటులో గడ్డంతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఆయన ఉన్న లోకం కూడా అత్యాధునిక హంగులతో మెరిసిపోతుంది. మరి ఈ చిత్రగుప్తుడి కథేంటో తెలియాలంటే ‘థ్యాంక్ గాడ్’ (Thank God) సినిమా చూడాల్సిందే. సిద్ధార్థ్ కారు ప్రమాదానికి గురై యమలోకానికి వెళ్లడం అక్కడ చిత్రగుప్తుడిగా అజయ్ ప్రత్యక్షమవ్వడం మెప్పించాయి. అజయ్ ఆడించిన ‘గేమ్ ఆఫ్ లైఫ్’లో సిద్ధార్థ్ ఆడిన తీరు ఆకట్టుకుంది. మరి ఆట ఏంటి? ఎలా సాగింది? సిద్ధార్థ్ తిరిగి బతికాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్
-
India News
అశ్లీల దృశ్యాలు చూస్తూ.. వివాదంలో ఎమ్మెల్యే..!