The Delhi Files: పెద్ద స్టార్స్‌ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు

‘ది దిల్లీ ఫైల్స్‌’లో పెద్ద స్టార్స్‌ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.  

Published : 23 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో సంచలనం సృష్టించారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఇటీవల ఆయన మరో సంచలనానికి తెరదీస్తూ ‘ది దిల్లీ ఫైల్స్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన అప్‌డేట్‌ ఇచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం ‘ది దిల్లీ ఫైల్స్‌’ ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. కచ్చితంగా వచ్చే సంవత్సరంలో ఇది ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నట్లు తెలిపారు. ఇందులో పెద్ద స్టార్స్‌ ఎవరూ ఉండరని, కంటెంట్‌ మాత్రం చాలా పెద్దదన్నారు.

ఈ చిత్రం గురించి వివేక్‌ మాట్లాడుతూ.. ‘కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం ప్రారంభించాను. వాటిలో మొదటిది ‘ది తాష్కంట్‌ ఫైల్స్‌’.. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ వరుసలో మూడోది ‘ది దిల్లీ ఫైల్స్‌’ దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రానికి కూడా అభిషేక్‌ అగర్వాలే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వివేక్‌ ‘పర్వ’తో బిజీగా ఉన్నారు. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాభారతం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మూడు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని