Kannappa: కేన్స్‌లో కన్నప్ప

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ బృందం సందడి చేసింది. కథానాయకుడు మంచు విష్ణు, నిర్మాత, నటుడు మంచు మోహన్‌బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితరులు చిత్రోత్సవాలకి హాజరయ్యారు.

Published : 22 May 2024 01:09 IST

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ బృందం సందడి చేసింది. కథానాయకుడు మంచు విష్ణు, నిర్మాత, నటుడు మంచు మోహన్‌బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితరులు చిత్రోత్సవాలకి హాజరయ్యారు. అక్కడ ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన పంపిణీదారులు, ఇతర సినీ వర్గాలకు టీజర్‌ ఎంతగానో నచ్చిందని...అక్కడ లభించిన స్పందనని చూశాక ఎంతో ఆనందం కలిగిందన్నారు మంచు విష్ణు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ... ‘‘కన్నప్ప’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ నెల 30న టీజర్‌ని చూపించబోతున్నాం. హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్లలో టీజర్‌ ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేశాం. భారతదేశంలోని ఇతర భాషల్లో జూన్‌ 13న టీజర్‌ని విడుదల చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని