Por Thozhil ott: ఓటీటీలో తమిళ్‌ సెన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌

por thozhil ott release date: శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించిన ‘పొర్‌ తొళిల్‌’ సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Updated : 01 Aug 2023 17:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆద్యంతం ఉత్కంఠతో అలరించే క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ఇటీవల విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కథతోనే ఇటీవల తమిళంలో వచ్చిన చిత్రం ‘పొర్‌ తొళిల్‌’ (por thozhil ott release date). శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 9న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రూ.50కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? చూద్దామని ఎదురు చూస్తున్న నెటిజన్ల కోరిక నెరవేరబోతోంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌ తెలిపింది.

కథేంటంటే: అడిషనల్‌ డీజీపీ మహేంద్రన్‌ ఆదేశాల మేరకు ఎస్పీ లోకనాథన్‌ వద్ద డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు ప్రకాశ్‌ (అశోక్ సెల్వన్‌). అతనితో పాటు  టెక్నికల్‌ అసిస్టెంట్‌ వీణ (నిఖిలా విమల్‌) కూడా వస్తుంది. తిరుచ్చిలో జరిగిన బాలిక హత్య కేసు విచారణ చేసే బాధ్యత ఈ ముగ్గురిపై పడుతుంది. తీవ్ర గాయాల పాలైన  ఆ బాలిక మృతి వెనుక కారణం ఏంటి? ఆ హత్యను ఎవరు చేశారు? ఈ క్రమంలో లోకనాథన్‌, ప్రకాశ్‌, వీణలకు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని