Jyothika: దక్షిణాది వాళ్లకు బాలీవుడ్‌లో గౌరవం దక్కుతోంది

‘ప్రేక్షకులకు ఉత్తరాది, దక్షిణాది తేడాలేం ఉండవు. కథ, తెరకెక్కించిన విధానం బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు’ అంటోంది సీనియర్‌ నటి జ్యోతిక.

Published : 05 Jun 2024 01:05 IST

‘ప్రేక్షకులకు ఉత్తరాది, దక్షిణాది తేడాలేం ఉండవు. కథ, తెరకెక్కించిన విధానం బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు’ అంటోంది సీనియర్‌ నటి జ్యోతిక. పాతికేళ్ల కిందట ‘డోలీ సజాకే రఖ్‌నా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో పరిచయమైన ఆమె.. ‘షైతాన్‌’, ‘శ్రీకాంత్‌’లతో మళ్లీ బాలీవుడ్‌కి దగ్గరైంది. ‘ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ రెండు సినిమాలతో బాలీవుడ్‌లోకి రావడం గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నట్టుగా అనిపించింది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో తన సంతోషం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం భారతీయ చిత్రసీమ అత్యుత్తమ దశలో ఉంది. ఉత్తర, దక్షిణ అంటూ ప్రేక్షకుడికి ఇప్పుడు తేడాలేమీ లేవు. వాళ్లకి కావాల్సింది వినోదం, మంచి సినిమా అందించడం మాత్రమే. కానీ ఒక నటిగా దక్షిణాదిలో నాకు మంచి పాత్రలు దక్కాయి. దక్షిణాది నటీనటులకు బాలీవుడ్‌లో ఇప్పుడు మంచి గౌరవం దక్కుతోందని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని