Ravi Teja: అనుదీప్‌ దర్శకత్వంలో...

‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌.కె.వి. దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ కలయికలో సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనుంది. ఒకవైపు స్క్రిప్ట్‌ పనులు కొనసాగుతుండగా... మరోవైపు తారాగణం ఎంపికపై కూడా కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Updated : 22 Jan 2024 11:05 IST

‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌.కె.వి. దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ కలయికలో సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనుంది. ఒకవైపు స్క్రిప్ట్‌ పనులు కొనసాగుతుండగా... మరోవైపు తారాగణం ఎంపికపై కూడా కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రవితేజ సరసన రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటించే అవకాశాలున్నట్టు సమాచారం. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన నటి రుక్మిణీ వసంత్‌. ప్రస్తుతం రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక అనుదీప్‌ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని