OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు.. ఇవే..!

OTT Movies and web-series: ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో చూసేయండి.

Updated : 20 Jul 2023 15:28 IST

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బవాల్‌’..!

బాలీవుడ్‌ నటీనటులు జాన్వీకపూర్‌ (Janhvi Kapoor), వరుణ్‌ ధవన్‌ (Varun Dhawan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బవాల్‌’ (Bawaal). నితీశ్‌ తివారీ దర్శకుడు. మనసును హత్తుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 21 నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.


థ్రిల్‌ కోసం ‘అశ్విన్స్‌’..!

వసంత్‌ రవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అశ్విన్స్‌’ (Asvins). విమలా రామన్‌ ముఖ్యపాత్ర పోషించారు. తరుణ్‌ తేజ దర్శకుడు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నేటి నుంచి ఇది ప్రసారం అవుతోంది.


యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’..!

ఉదయ్‌ శంకర్‌ (Uday Shankar) కథానాయకుడిగా దర్శకుడు గురుపవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ (Nacchindi Girl Friendu). జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఆహా వేదికగా శుక్రవారం (జులై 21) నుంచి ఇది ప్రసారం కానుంది. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన యువకుడు ఆ అమ్మాయిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.


ఓటీటీలో ప్రసారం కానున్న మరి కొన్ని సినిమాలు \ సిరీస్‌లు..!

నెట్‌ఫ్లిక్స్‌

  • స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3) జులై 20
  • దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) జులై 21

జియో సినిమా

  • ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) జులై 21
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని