Karthikeya: ఆ వెలితిని ‘భజే వాయు వేగం’ తీరుస్తుంది!

‘‘నేను ఎలాంటి కథ, పాత్ర చేద్దామనుకున్నానో.. నా సినిమాలో ఎలాంటి ఎమోషన్, డ్రామా ఉండాలని ఆశిస్తానో.. అవన్నీ వందశాతం కుదిరిన చిత్రం ‘భజే వాయు వేగం’. దీంట్లోని ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్, డ్రామా..

Updated : 26 May 2024 08:43 IST

‘‘నేను ఎలాంటి కథ, పాత్ర చేద్దామనుకున్నానో.. నా సినిమాలో ఎలాంటి ఎమోషన్, డ్రామా ఉండాలని ఆశిస్తానో.. అవన్నీ వందశాతం కుదిరిన చిత్రం ‘భజే వాయు వేగం’. దీంట్లోని ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్, డ్రామా.. అన్నీ నేరుగా ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి’’ అన్నారు హీరో కార్తికేయ. ఆయన.. ఐశ్వర్య మేనన్‌ జంటగా ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు తెరకెక్కించిన ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. రాహుల్‌ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘నా ఆరేళ్ల కెరీర్‌లో దాదాపు తొమ్మిది చిత్రాలు చేశా. వాటిలో కొన్ని హిట్లు మరికొన్ని ప్లాపులు ఉన్నాయి. నా చివరి సినిమా ‘బెదురులంక’ ఆదరణ దక్కించుకున్నా.. ఓ సరైన చిత్రంతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంటుంది. ఆ వెలితిని ఈ ‘భజే వాయు వేగం’ తీరుస్తుంది. ఇది నా కెరీర్‌కు మరో బెంచ్‌ మార్క్‌ చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఇదొక మంచి ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఒక సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తికరంగా చూపించనున్నాం’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మేనన్, మధు శ్రీనివాస్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని