Thu kya jan: నా కళ్లు పలికించే ప్రేమ

ప్రేమలో కొత్త లోకాన్ని వెతికే ప్రేమికులకు ‘తు క్యా జానే’ పాట అంకితం అంటోంది ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ చిత్రబృందం.

Updated : 04 Apr 2024 09:45 IST

ప్రేమలో కొత్త లోకాన్ని వెతికే ప్రేమికులకు ‘తు క్యా జానే’ పాట అంకితం అంటోంది ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ చిత్రబృందం. అమర్‌ సింగ్‌ చమ్కీలా జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో దిల్జీత్‌ దోసాంజ్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నారు. పరిణీతి చోప్రా కథానాయికగా ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ‘తు క్యా జానే’ అనే పాటను విడుదల చేసింది. ‘ప్రియతమా..నీపై నాకున్న ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేవు. మాటల్లో తెలుపలేని ప్రేమని నా కళ్లు పలికిస్తున్నాయి’ అంటూ పరిణీతి ప్రేమ పాట పాడుతోంది. ఈ పాటను యషికా సిక్కా ఆలపించగా, ఇర్షాద్‌ కమిల్‌ సాహిత్యం అందించారు.ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని