Cinema News: నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

హాస్య ప్రధానమైన పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వేశ్వరరావు (64) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున చెన్నై సమీప సిరుశేరిలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Updated : 03 Apr 2024 14:10 IST

హాస్య ప్రధానమైన పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వేశ్వరరావు (64) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున చెన్నై సమీప సిరుశేరిలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల నటుడిగా సినీ ప్రయాణాన్ని ఆరంభించి, తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో బాలనటుడిగానే 150కిపైగా సినిమాలు చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్‌, పవన్‌కల్యాణ్‌ తదితర అగ్ర తారలతో కలిసి నటించారు. ‘ముఠామేస్త్రి’, ‘బిగ్‌బాస్‌’, ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం’, ‘ఆయనకి ఇద్దరు’,  ‘మెకానిక్‌ అల్లుడు’, ‘శివపుత్రుడు’, ‘శివాజి’,  ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తదితర చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు. నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. 150 ధారావాహికలతో రెండు భాషల్లోనూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు భార్య వరలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు