Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ దర్శకులు.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ దర్శకులు బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హిందూపురంలో హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించినందుకు అభినందించారు.

Published : 07 Jun 2024 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్‌ దర్శకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆయన అక్కడ భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకులు ఆయన్ని కలిసి అభినందించారు. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi), బాబీ, గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) బాలకృష్ణను (Balakrishna) కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. బాలకృష్ణ అభిమానులు వాటిని షేర్‌ చేస్తున్నారు.

మోదీతో అకీరా.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రేణూదేశాయ్‌

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా(#NBK109)లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాసీ లుక్‌లో కనిపించనున్నారట. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని టాక్‌. ఇందులో మలయాళం అగ్ర హీరో కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన దీని ప్రచార చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. అలాగే రజనీకాంత్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar) తెరకెక్కించనున్న ‘జైలర్‌2’లోను బాలకృష్ణ అతిథిపాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని