Tollywood: ‘మెకానిక్‌’ సందడి

మణిసాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌’. ట్రబుల్‌ షూటర్‌.. ఉపశీర్షిక. ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నారు. నాగ మునెయ్య నిర్మాత. డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Updated : 30 Nov 2023 06:54 IST

మణిసాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌’. ట్రబుల్‌ షూటర్‌.. ఉపశీర్షిక. ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నారు. నాగ మునెయ్య నిర్మాత. డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్ర పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ‘‘ఓ మెకానిక్‌ కథ ఇది. అతని దగ్గరికి  ఎవరెవరు ఎలాంటి సమస్యలతో వచ్చారు? వాటిని తన భుజాన వేసుకున్నాక ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే విషయాలు ఇందులో కీలకం. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నాయి సినీవర్గాలు.


త్వరలోనే ధ్రువ నక్షత్రం

విక్రమ్‌ కథానాయకుడిగా గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధ్రువనక్షత్రం’. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ‘నవంబరు 24న మా చిత్రం విడుదల చేయాలని ఎంతో ప్రయత్నించాం. కొన్ని అడ్డంకుల కారణంగా సమయానికి విడుదల చేయలేకపోవడంతో ఎంతో నిరాశ చెందాం. ప్రేక్షకుల ప్రేమ, అందరి మద్దతుతో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకొస్తాం. తేదీ ప్రకటిస్తాం’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు దర్శకుడు.


వచ్చే ఏడాది.. వాజ్‌పేయీ జీవిత ప్రయాణం

రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రతిభాశాలి, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మై అటల్‌ హూ’. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠీ ఇందులో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. రవి జాదవ్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలుపుతూ.. సినిమాలోని కొన్ని పోస్టర్లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు పంకజ్‌. ‘ఉక్కు మనిషి, కవి, నవ భారత దార్శనికుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవిత ప్రయాణాన్ని వచ్చే ఏడాది జనవరి 19న చూడడానికి సిద్ధంగా ఉండండి’ అనే వ్యాఖ్యల్ని జోడించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు