Tom Cruise: అంతరిక్షంలో షూటింగ్‌

భారీ యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన టామ్‌క్రూజ్‌ మరో సాహసం చేస్తున్నాడు. ఈసారి ఏకంగా అంతరిక్షంలోనే షూటింగ్‌ చేయబోతున్నాడు. ఈ వివరాల్ని సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి.

Updated : 12 Oct 2022 07:16 IST

భారీ యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన టామ్‌క్రూజ్‌ (Tom Cruise) మరో సాహసం చేస్తున్నాడు. ఈసారి ఏకంగా అంతరిక్షంలోనే షూటింగ్‌ చేయబోతున్నాడు. ఈ వివరాల్ని సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. టామ్‌ ప్రస్తుతం దర్శకుడు డగ్‌ లీమన్‌తో కొత్త సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. కథలో భాగంగా కొన్ని దృశ్యాల చిత్రీకరణ కోసం టామ్‌ క్రూజ్‌ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నట్టు దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ యూనివర్సల్‌ ఫిల్మ్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ (యూఎఫ్‌ఈజీ) ఛైర్మన్‌ డోనా లాంగ్లీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ‘టామ్‌ క్రూజ్‌ మనతోపాటు అభిమాన ప్రపంచాన్నే అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాకెట్‌లో వెళ్లి త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం అన్నారామె. దీంతో.. వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసిన తొలి సామాన్య పౌరుడిగా టామ్‌ క్రూజ్‌ చరిత్ర సృష్టించనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని