Ravi teja: రవితేజ సరసన ‘యానిమల్‌’ హీరోయిన్‌..!

‘యానిమల్‌’(Animal)తో అందరినీ ఆకట్టుకున్నారు నటి త్రిప్తి డిమ్రి. రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో త్రిప్తికు అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 07 Dec 2023 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘యానిమల్‌’ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ఇందులో సెకండ్‌ హీరోయిన్‌గా త్రిప్తి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె పేరే కనిపిస్తోంది. దీంతో ఆమె చేయనున్న తర్వాత ప్రాజెక్ట్‌ల గురించి వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో త్రిప్తికు అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

రవితేజ (Ravi teja) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘ఈగల్‌’ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల కానుంది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందింది. ఇందులో రవితేజ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక దీని తర్వాత గోపిచంద్‌ మలినేని-రవితేజ కాంబోలో ఓ సినిమా రానుంది. దీనితో పాటే అనిల్‌ రావిపూడి చిత్రం కూడా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని