Tripti Dimri: రూహ్ బాబా మ్యాజిక్కే వేరు!
‘యానిమల్’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి.
‘యానిమల్’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆమె.. ‘భూల్ భులయ్యా 3’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె, కార్తిక్ ఆర్యన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రూహ్ బాబా పాత్రలో సందడి చేయనున్నారు కార్తిక్. ఇటీవలే షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ సినిమా.. మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఓ ఫొటోను పంచుకుంది త్రిప్తి. ‘‘ఎంతో అద్భుతంగా మొదలు పెట్టిన మా ప్రయాణంలో మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించాము. కానీ ఈ చిన్న విరామం నన్ను అసహనానికి గురి చేస్తుంది. ఇందులో రూహ్ బాబా చేసే మ్యాజిక్ మరింత భిన్నంగా ఉండబోతుంది’’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. విద్యాబాలన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
Purushothamudu: ఊరంతా మెచ్చే ‘పురుషోత్తముడు’.. రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్!
రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). రామ్ భీమన దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్‌లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్‌డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
‘ఈటీవీ విన్’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్‌పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్‌కు కారణమిదే: మనోజ్ బాజ్‌పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. -
Suma Adda: నాకు నచ్చని ఒకే ఒక పదం ‘మేకప్’!.. సుమతో హీరో కార్తికేయ సూపర్ ఫన్
ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్లో ‘భజే వాయువేగం’ చిత్ర బృందం సందడి చేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు.
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
వినోదభరితమైన ‘సంగీత్’
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా సాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంగీత్’. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పతాక పోరాటంలో నాని
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ‘సరిపోదా శనివారం’ చూడాల్సిందే. -
ప్రతిఒక్కరూ తమకు అన్వయించుకోగలిగే కథ ఇది
‘రాజు యాదవ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
హడలెత్తిస్తాం.. నవ్వించేస్తాం
ప్రేమకథలు.. కామెడీ ఎంటర్టైనర్లు.. ఇలా భిన్నమైన జానర్లలో చిత్రాలు వచ్చినప్పటికీ హారర్ చిత్రాలంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది సినీప్రియులకి. మరి ఈ హారర్ చిత్రాలకి కామెడీ తోడైతే ప్రేక్షకులకు పండగే కదా. భయపెడుతూ.. అంతలోనే నవ్వులు పూయించే హాస్యంతో ముందుకు సాగుతుంటాయి ఈ సినిమాలు. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని హారర్ చిత్రాలు కామెడీ అంశాల మేళవింపుగా రూపొందుతున్నాయి. -
జోడీ కుదిరినట్టేనా?
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. -
హైదరాబాద్‌లో రామ్‌చరణ్ ఆట
చాలా రోజులుగా సెట్స్‌పై ఉన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.... అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. -
ఆ మ్యాజిక్ కొన్నిసార్లే..!
సవాళ్లతో కూడిన పాత్రల్ని భుజాన మోసే కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ‘మహానటి’కి ముందు... తర్వాత అన్నట్టుగా మారింది ఆమె కెరీర్. అప్పట్నుంచి మరింత బాధ్యతగా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది కీర్తి. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే