Triptii Dimri: అలా కెరీర్‌ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి

నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు.

Published : 25 Mar 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ పాత్ర ఇచ్చినా దానికి వందశాతం న్యాయం చేయాలని నటి త్రిప్తి డిమ్రి (Triptii Dimri) అన్నారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై (Priyanka Chopra) తనకున్న అభిమానాన్ని మరోసారి వెల్లడించారు. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించారు.

‘మరో దేశానికి వెళ్లి కెరీర్‌ ప్రారంభించాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రియాంకకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే అలా హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఎంతోమంది నటీమణులకు స్ఫూర్తి. నాకు చాలా ఇష్టం. ప్రియాంక నటించిన ‘బర్ఫీ’ మొదటిసారి చూసినప్పుడు నేను ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా అందులో మనం కనిపించకూడదు. మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర పేరుతో మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ప్రశంస మరొకటి ఉండదు’ అని చెప్పారు. తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ప్రియాంక ఒకరని త్రిప్తి గతంలోనూ పేర్కొన్నారు.

‘యానిమల్‌’తో సూపర్‌ సక్సెస్‌ను అందుకున్న త్రిప్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘బ్యాడ్‌ న్యూజ్‌’లో నటిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఆనంద్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. దీని గురించి త్రిప్తి మాట్లాడుతూ.. ‘అత్యంత వినోదభరితమైన హంగామా కోసం సిద్ధంగా ఉండండి. ఎన్ని బిలియన్ల బాధలున్నా.. ఉల్లాసాన్ని కలిగించే కామెడీ చిత్రం మీకోసం ఎదురుచూస్తోంది’ అన్నారు. జులై 19న సినిమా విడుదల కానుంది. దీనితో పాటు ‘భూల్‌ భులయ్యా 3’ (Bhool Bhulaiyaa 3)లోనూ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని