Twinkle Khanna: దావుద్‌ పార్టీలో డ్యాన్స్‌.. అక్షయ్‌కుమార్‌ సతీమణి ఏమన్నారంటే..?

అండర్ వరల్డ్ డాన్‌, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్‌ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్‌ కుమార్‌ సతీమణి, నటి ట్వింకిల్‌ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు.

Updated : 22 Apr 2024 13:02 IST

ముంబయి: రచయిత, కాలమిస్ట్‌గా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెడుతుంటారు నటి ట్వింకిల్‌ ఖన్నా. తాజాగా ఆమె ఫేక్‌న్యూస్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కొంతమంది అవాస్తవాలు వైరల్‌ చేస్తున్నారని చెప్పారు. దాదాపు పదేళ్ల క్రితం తనపై వచ్చిన ఓ సంచలన వార్త గురించీ ఆమె మాట్లాడారు.

‘‘కరోనా సమయంలో ఎన్నో ఫేక్‌ వార్తలను మనం చూశాం. ఇటీవల జరిగిన రెజ్లర్ల నిరసనలో వినేశ్‌, సంగీత ఫొగాట్‌ నవ్వుతూ ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటోలూ వచ్చాయి. పలు విధాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని అవాస్తవ కథనాలు సృష్టిస్తున్నారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావుద్‌ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్‌ చేసినట్లు అప్పట్లో టీవీలో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నా పిల్లలు కూడా నవ్వుకున్నారు. నేను డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబానికి బాగా తెలుసు. అందుకే వాళ్లు వాటిని నమ్మలేదు. దావుద్‌ కావాలనుకుంటే నాకంటే గొప్ప డ్యాన్సర్స్‌ను పెట్టుకుంటారనే విషయాన్ని టీవీ ఛానల్స్‌ గ్రహించి ఉంటే బాగుండేది’’ అని ఆమె అన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన సమయంలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయని.. వాట్సప్‌, ఇతర సోషల్‌మీడియా పేజీల్లో వచ్చిన పోస్టులు చూసి.. అందరూ అవే నిజమని భావించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని