Bollywood: విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు..!
తన స్టైల్‌తో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ ప్రారంభంలోనే తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు నిర్మాతలు ఈ యంగ్ హీరోను సంప్రదించినట్లు సమాచారం.
హైదరాబాద్: టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒకరు. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తొలి చిత్రంతోనే తన నటనతో అలరించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. తాజాగా ‘లైగర్’(Liger)తో ప్రేక్షకులను పలకరించిన ఈ సెన్సెషనల్ హీరో ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ఆ తర్వాత లైగర్ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని పూరీ జగన్నాథ్‌తో తీయాల్సిన ‘జనగణమన’ను పక్కన పెట్టారు. రీసెంట్ అప్‌డేట్ ప్రకారం ఈ యంగ్ హీరో గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)తో సినిమా కోసం చర్చలు జరిపారట అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
అయితే ఈ హీరోకు రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని టాక్. బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు విజయ్‌ను సంప్రదించారట. కరణ్ జోహార్(Karan Johar) ఓ దర్శకుడితో కలిసి ఇటీవల విజయ్‌తో సినిమా గురించి మాట్లాడారని సమాచారం. మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ విజయ్‌తో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్లాన్ చేస్తోందట. ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘‘ఖుషి’’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అగ్ర కథానాయిక సమంత నటిస్తోంది. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై విజయ్ అభిమానులు ఇప్పటికే భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-02-2023)
-
India News
కోర్టు ప్రాంగణంలో చిరుత హల్చల్.. ముగ్గురికి గాయాలు
-
Viral-videos News
Viral Video: నడిరోడ్డుపై ‘విచ్చలవిడి’గా.. బైక్‌పై వికృత చేష్టలు.. వీడియో వైరల్!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ ఖరారు.. ఇంకా తేలని బెర్తులు
-
Movies News
Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్