Ugadi: పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్‌ హీరో

ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

Updated : 09 Apr 2024 12:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సోషల్‌ మీడియాలో ఉగాది సినీ పోస్టర్ల సందడి నెలకొంది. పండగ వచ్చిందంటే ఫ్యాన్స్‌.. అభిమాన తారల సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదరుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే పండగ సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది. మాస్‌ హీరో రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘RT75’ పేరుతో దీని పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే నవదీప్‌ హీరోగా తెరకెక్కిన ‘లవ్‌మౌళి’ ట్రైలర్‌ను విడుదలచేశారు. మరి ఉగాది సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త సినిమా పోస్టర్లను, స్టార్స్‌ చెప్పిన శుభాకాంక్షలను చూసేద్దాం (Ugadi 2024 movie updates).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు