Eagle trailer: రవితేజ అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌.. ట్రైలర్‌ ఎప్పుడంటే?

Eagle: రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈగల్‌ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది.

Published : 18 Dec 2023 17:31 IST

హైదరాబాద్‌: రవితేజ (Ravi teja) కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్‌’. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో రవితేజ అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. డిసెంబరు 20 సాయంత్రం 4.05గంటలకు ‘ఈగల్‌’ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ అంచనాలు పెంచగా, ట్రైలర్‌ కోసం అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఇదొక వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోంది. రవితేజ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి డేవ్‌ జాంద్‌ సంగీతమందిస్తుండగా.. కార్తీక్‌, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 13న ‘ఈగల్‌’ థియేటర్లలో సందడి చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని