upcoming movies: ఈ వారం థియేటర్‌లో ఆసక్తికర మూవీస్‌.. ఓటీటీలో డబుల్‌ ఫన్‌..

ఏప్రిల్‌ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి.

Published : 22 Apr 2024 09:59 IST

రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ..

నారా రోహిత్‌ (Nara Rohit) కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రతినిధి’ సిరీస్‌ నుంచి వస్తున్న రెండో ఫ్రాంచైజీ ఇది. ఇందులో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నారు’ అని చిత్ర బృందం చెబుతోంది.


క్రేజీ కాంబినేషన్‌ ‘రత్నం’..

విశాల్‌ (Vishal), ప్రియా భవానీ శంకర్‌ జంటగా... హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’ (Ratnam movie). కార్తికేయన్‌ సంతానం నిర్మాత. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యాక్షన్‌ చిత్రాలకి పెట్టింది పేరైన హరి - విశాల్‌ కలయికలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు దీటుగా చిత్రం రూపొందింది. కథ, కథనాలు ప్రేక్షకుల  మనసుల్ని హత్తుకుంటాయి’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


యాక్షన్‌ హంగామా ‘రుస్లాన్‌’

ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’ (Ruslaan). శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.  జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భావోద్వేగాలు, యాక్షన్‌, మంచి సంభాషణలు, అందమైన విజువల్స్‌ ఉన్న చిత్రమిది. గొప్ప అనుభూతిని పంచేలా చిత్రాన్ని తీశాం’ అని దర్శకుడు తెలిపారు.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

  • డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 25
  • టిల్లు స్క్వేర్‌ (తెలుగు) - ఏప్రిల్‌ 26

అమెజాన్‌ ప్రైమ్‌

  • దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్‌ 25

బుక్‌ మై షో

  • కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌) - ఏప్రిల్ 26
  • డిస్నీ
  • భీమా (తెలుగు) - ఏప్రిల్‌ 25

  • క్రాక్‌ (హిందీ)- ఏప్రిల్‌ 26

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ది బీ కీపర్‌ (హాలీవుడ్‌) - ఏప్రిల్‌ 26

జియో

  • ది జెనెక్స్‌(వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 22

ఆపిల్‌ టీవీ

  • ది బిగ్‌ డోర్‌ ప్రైజ్‌2 (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 24
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని