upcoming movies: కొత్త ఏడాదిలో ప్రేక్షకులను పలకరించే మొదటి చిత్రాలివే!

upcoming movies: 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇటు థియేటర్‌తో పాటు, అటు ఓటీటీలోను పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.

Published : 01 Jan 2024 09:47 IST

హీరోగా వస్తున్న గాయని సునీత కుమారుడు

గాయని సునీత (Singer Sunitha) తనయుడు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం ‘సర్కారు నౌకరి’ (Sarkaaru Noukari). గంగనమోని శేఖర్ దర్శకుడు. భావన వళపండల్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇది కంటెంట్‌ ఓరియెంటెడ్‌గా సాగే సినిమా. యథార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా, కథనాలు ఉంటాయి. వాస్తవికతకు ఈ మూవీ అద్దం పడుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది.


రాఘవరెడ్డి కథేంటి?

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు సంజీవ్ మేగోటి  దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా  జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామాతో నవసరాలు మేళవించిన ‘రాఘవరెడ్డి’ రూపొందించినట్లు చిత్ర బృంద తెలిపింది. పోలీసులకు సైతం అంతుచిక్కని నేరాలపై పరిశోధన చేసే క్రిమినాలజీ ప్రొఫెసర్‌ పాత్రను శివ పోషిస్తున్నారు.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

అందమైన కథగా.. #90s

 ‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటున్నారు శివాజీ (Shivaji). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ (A Middle Class Biopic). వాసుకి ఆనంద్‌, మౌళి, వసంతిక, రోహన్‌, స్నేహల్‌ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య హసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 5వ తేదీ నుంచి ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది.


నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా ‘హాయ్‌ నాన్న’(Hi Nanna). ఈ చిత్రం డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జనవరి 4 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించిన ఈ చిత్రంలో బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించారు.

 • ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు
 • నెట్‌ఫ్లిక్స్‌
 • బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 01
 • ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01
 • ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04
 • ‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) జనవరి 05
 • గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 05
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • టైగర్‌ (హిందీ) డిసెంబరు 31
 • మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) జనవరి 1
 • జియో సినిమా
 • మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) జనవరి 03
 • జీ5
 • తేజస్‌ (హిందీ) జనవరి 05
 • సోనీలివ్‌
 • క్యూబికల్స్‌ (హిందీ) జనవరి 05
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని