upcoming movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్‌

బాక్సాఫీస్‌ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.

Updated : 08 Apr 2024 10:06 IST

ఎట్టకేలకు వస్తున్న ‘మైదాన్‌’

‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా నటిస్తున్న చిత్రమే ‘మైదాన్‌’ (Maidaan). అజయ్‌, ప్రియమణి జంటగా అమిత్‌ శర్మ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


యాక్షన్‌ ప్రియుల కోసం..

యాక్షన్‌ ప్రియులకు మంచి ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan). అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 10న ఈ మూవీని థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు.


ముద్దుగా భయపెడుతుంది గీతాంజలి

భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన చిత్రం ‘గీతాంజలి’. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రస్తుతం రాబోతున్న చిత్రం  ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi).  శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ మొదలవుతుందని, ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ కామెడీ చిత్రాలన్నింటికీ మించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఏప్రిల్‌ 11న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.


ప్రేమికుల సమస్యలకు ‘లవ్‌ గురు’ పరిష్కారాలు

‘‘ప్రేమ విశ్వజనీనమైనది. అది ఎక్కడైనా ఒక్కటే. సమాజంలో దాదాపు 95 శాతం మంది ప్రేమకి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. వాటికి మా సినిమాలో లవ్‌ గురు ఎలా పరిష్కారం కనుక్కున్నాడో తెరపై చూసి తెలుసుకోవల్సిందే’’ అంటున్నారు విజయ్‌ ఆంటోనీ. ఆయన కథానాయకుడిగా  నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రమే ‘లవ్‌ గురు’ (Love guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


భార్య గురకపెడితే

జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘డియర్‌’ (DeAr). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం ఒక్కరోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న తెలుగులోనూ రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. భార్య గురక పెట్టడం వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వారి రిలేషన్‌షిప్‌ ఎలాంటి సమస్యలకు గురైంది. తదితర విషయాలను వినోదాత్మకంగా చూపించారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • అన్‌లాక్డ్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 10
  • వాట్‌ జెన్నీఫర్‌ డిడ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 10
  • బేబీ రెయిన్‌డీర్‌ (హలీవుడ్‌) ఏప్రిల్ 11
  • హార్డ్‌బ్రేక్‌ హై (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 11
  • అమర్‌సింగ్‌ చమ్కీలా (హిందీ) ఏప్రిల్‌ 12
  • అమెజాన్‌ప్రైమ్‌
  • ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12
  • జీ5
  • గామి (తెలుగు) ఏప్రిల్‌ 12 (Gaami ott release)
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • బ్లడ్‌ ఫ్రీ (కొరియన్‌) ఏప్రిల్‌ 10
  • ప్రేమలు (మలయాళం) ఏప్రిల్‌ 12
  • ది గ్రేటెస్ట్‌ హిట్స్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 12
  • సోనీలివ్‌
  • అదృశ్యం (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 11
  • ఆహా
  • కార్తీక (తెలుగు) ఏప్రిల్‌ 09
  • ప్రేమలు (తెలుగు) ఏప్రిల్‌ 12 (Premalu ott release)
  • లయన్స్‌ గేట్‌ప్లే
  • హైటౌన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12
  • సన్‌నెక్ట్స్‌
  • లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు)  ఏప్రిల్‌ 12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని